ముఖం దాకా దుప్పటి కప్పుకుంటున్నారా?
చలిగా ఉందని ముఖం నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటే లేనిపోని తిప్పలు తప్పవు. ఇలా చేస్తే ఫ్రెష్ ఆక్సిజన్ అందక.. మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్‌నే మళ్లీ పీల్చుకోవాల్సి వస్తుంది. దీని వల్ల ఊపిరి ఆడకపోవడం, ఉక్కపోతతో నిద్ర డిస్టర్బ్ అవ్వడం ఖాయం. తెల్లారాక తలనొప్పి, నీరసం, తల తిరగడం వంటివి వేధిస్తాయి. కావున.. ఈ అలవాటుకు వెంటనే గుడ్ బై చెప్పేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.