VIDEO: 'వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం'

VIDEO: 'వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం'

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ శివాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని మహిళలు సోమవారం తెల్లవారుజామున వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహా రుద్రాభిషేకం, దీపాలంకరణ, హారతి, అన్నదాన ప్రసాద కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.