బోనకల్- ఖమ్మం మధ్య రాకపోకలకు అంతరాయం
KMM: చింతకాని మండలం రామకృష్ణాపురం- కందికుంట వద్ద శనివారం బోనకల్ ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కందికుంట చెరువుకు ఒక్కసారిగా అలుగుపడటంతో ప్రధాన రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను కొనసాగిస్తున్నారు.