టైక్వాండో క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
KRNL: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. అండర్ 19, అండర్ 17 విభాగాల్లో క్రీడాకారులు సుగందిని, ఇంద్రాణి, లేఖ్యశ్రీ, నక్షత్ర, రేవంత్ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కోచ్ షబ్బీర్ హుస్సేన్‌ను కూడా కలెక్టర్ ప్రశంసించారు.