VIDEO: ప్రతి సమస్య పరిష్కరిస్తా: మంత్రి పార్థసారథి

VIDEO: ప్రతి సమస్య పరిష్కరిస్తా: మంత్రి పార్థసారథి

ELR: ఆగిరిపల్లి గ్రామంలో నూజివీడు నియోజకవర్గస్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. స్వయంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రజల నుంచి వారి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. ప్రజల సమస్యలను చర్చించి ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.