వచ్చే ఎన్నికల్లో వైసీపీ డకౌట్ ఖాయం: మంత్రి

AP: వచ్చే ఎన్నికల్లో YCP డకౌట్ ఖాయమని మంత్రి DBV స్వామి అన్నారు. 'రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్ లేదని జగన్‌కు అర్థమైంది. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. నవరత్నాల్లో ఒక్క రత్నమైనా జగన్ కోతల్లేకుండా అమలు చేశారా? ఆయనకు క్విడ్ ప్రోకో తప్ప పీపీపీ అంటే కనీసం అర్థం తెలుసా? జగన్ వైఖరి నచ్చకే ప్రజలు వైసీపీని పాతాళంలోకి నెట్టారు' అని పేర్కొన్నారు.