H.జంక్షన్‌లో ఘనంగా సామూహిక వ్రతాలు

H.జంక్షన్‌లో ఘనంగా సామూహిక వ్రతాలు

క‌ృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం సామూహిక వ్రతాలు వైభవంగా జరిగాయి. ట్రస్టీ కాకాని బాబు అరుణ దంపతులు భక్తులకు ఉచిత పూజా సామాగ్రి అందించి కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు చక్రావధానుల సీతారామాచార్యులు వ్రతాలు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.