నావల్ డాక్ యార్డ్ అభ్యర్థుల ఆందోళన

VSP: నావల్ డాక్ యార్డ్ ట్రేడ్స్ మ్యాన్ స్కిల్డ్ పోస్టులకు ఇండియన్ నేవీ విడుదల చేసిన నోటిఫికేషన్లో వయసు అర్హత సాధించలేకపోతున్నామని అప్రెంటిషిప్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చాలా కాలం నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం, డాక్ యార్డ్ అప్రెంటిషిప్ చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడం వల్ల వయసు పెరిగిందని పేర్కొన్నారు.