VIDEO: జింకను కాపాడిన గ్రామస్థులు
MDK: మనోహరాబాద్ మండలం జీడిపల్లి శివారులో ఒక జింకపై వీధి కుక్కలు దాడి చేశాయి. వ్యవసాయ పొలాల వద్ద జింకను కుక్కలు వేటాడి గాయపరచడాన్ని గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించి, కుక్కలను తరిమికొట్టారు. గాయపడిన జింకను సురక్షితంగా రక్షించి, అటవీ శాఖ, పశువైద్య అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జింకను స్వాధీనం చేసుకున్నారు.