VIDEO: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

MHBD: కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో తండ్రి తూళ్ళ ఐలయ్య(60) అనే వ్యక్తి సోమవారం మృతిచెందాడు. అతనికి కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె మహేశ్వరి తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఇది చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన అందరిని కలిసి వేసింది.