గద్వాల్-ఆత్మకూరు రహదారి గుంతలు

గద్వాల్-ఆత్మకూరు రహదారి గుంతలు

GDWL: గద్వాల్ నుంచి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతింది. పెద్దపాడు సమీపంలో రోడ్డు గుంతలతో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతైన గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే మరమ్మతులు చేసి కొత్త బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నారు.