కాంగ్రెస్‌కు భారీగా పెరిగిన విరాళాలు
కాంగ్రెస్‌కు గణనీయంగా విరాళాలు పెరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తమకు 2,501 మంది దాతల నుంచి రూ.517.37 కోట్ల విరాళాలు అందినట్లు తెలిపింది. రాజకీయ పార్టీలన్నీ రూ.20వేలకు మించి అందిన విరాళాల వివరాలు వెల్లడించాలన్న నిబంధనకు లోబడి కాంగ్రెస్ సమర్పించిన నివేదికను ఎన్నికల సంఘం విడుదల చేసింది.