గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

HYD: చెన్నాపురం చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. చెన్నాపురం చెరువులో గురువారం గుర్తు తెలియని వ్యక్తి (25-30) చెరువులో దూకాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.