కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
RR: ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పీఏసీఎస్‌లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అధికారులు నిరంతరం రైతులకు వెన్నంటే ఉండి వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.