ప్రమాణానికి సిద్ధమా?.. KTRకు బండి సంజయ్ సవాల్
TG: డ్రగ్స్ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా? అని నిలదీశారు. తన సవాల్‌కు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.