మహిళా దినోత్సవం.. మెగా హీరో వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా హీరో సాయి దుర్గా తేజ్ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. మహిళలను, అమ్మను గౌరవించాలని కోరుతూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం (@telangana_cops) నిర్వహించిన గొప్ప కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం తనకి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.