స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ELR: మండవల్లి గ్రామంలో శుక్రవారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను పెట్టిన కూటమి ప్రభుత్వం అదేవిధంగా చెత్త తీసుకుని నిత్యవసర సరుకులు అందించటం చాలా అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. రథానికి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని కోరారు.