ప్రకాశం జిల్లాలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్..!

ప్రకాశం: జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లెయిములకుగాను రూ.3.25కోట్ల రాయితీలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంజూరు చేశారు. బుధవారం ఆమె అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్లో వచ్చిన దరఖాస్తులను గడువు వరకు వేచి ఉండకూడదు అని తెలిపారు.