'గణపతి మండప నిర్వాహకులు రూల్స్ పాటించాలి'

WNP: జిల్లాలో గణపతి ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఎస్పీ గిరిధర్ బుధవారం తెలిపారు. మండపాల ఏర్పాటు కోసం పోలీసులు అనుమతి, కరెంటు కనెక్షన్ కోసం విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలన్నారు. మండపాల కోసం పూర్తిగా రోడ్లను బ్లాక్ చేయవద్దని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత మైకు స్పీకర్లు వాడవద్దని, డీజేలకు అనుమతి లేదన్నారు.