సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
ATP: సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం పామిడిలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేశారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.