ఎన్నికల సహాయక కేంద్రం ఏర్పాటు
WGL: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్‌లో ఎన్నికల సహాయక కేంద్రం (కంట్రోల్ రూమ్)ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నిక నియమాలు పాటించని వారిపై 18004253424 నెంబర్‌కు ఫిర్యాదు చేయగలరని పేర్కొన్నారు.