సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

NLR: జిల్లాలోని బాలాజీ నగర్‌లో జరుగుతున్న డ్రైన్ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను కమిషనర్ నందన్ బుధవారం తనిఖీ చేశారు. పనులను నాణ్యతగా, నిర్దేశించిన సమయంలోపు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రైను కాలువల ద్వారా మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా, వర్షపు నీరు రోడ్లపై నిలబడకుండా ప్రవహించే విధంగా పనులు చేపట్టాలని కమిషనర్ సూచించారు.