VIDEO: పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

VIDEO: పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే

NLR: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నివాళులర్పించారు. సోమవారం బుచ్చిరెడ్డిపాలెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలు గురించి కొనియాడారు. ఆయన పోరాటానికి నిదర్శనమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ అన్నారు. పొట్టి శ్రీరాములు పోరాటాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.