రేపు రావులపాలెం ఉచిత వైద్య శిబిరం
కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం1 గంటల వరకు ఉచిత హోమియో ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3గంటలు నుంచి 5గంటల వరకు చర్మ వ్యాధులు, దంత వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు