సింహాచలం ఘటనలో జిల్లా వాసులు మృతి

కోనసీమ: సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భారీ వర్షానికి గోడ కూలిన ఘటనలో ఇద్దరు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో అంబాజీపేట కొర్లపాటి వారి పాలెంకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (26), పత్తి దుర్గాస్వామి నాయుడు (33) మృతి చెందారు. ఈ ఘటనతో అంబాజీపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.