VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ గ్రామ సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. ఎస్సై శ్రీసాయి వివరాల ప్రకారం.. మాంజిరి గ్రామానికి చెందిన సిడాం గణేష్(26) బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి ఉట్నూరులోని గొట్టి గ్రామానికి చెందిన మధుకర్ ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన గణేష్‌ను 108లో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు.