'ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం'
ADB: గ్రామాల్లో ఆలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. మండల కేంద్రంలో శివ మార్కండేయ ఆలయ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ కుర్మే అన్నపూర్ణతో కలిసి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని గజేందర్ పేర్కొన్నారు.