రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

రైలు ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

MBNR: మహబూబ్ నగర్-మన్యంకొండ మధ్య రైల్వే డబ్లింగ్, విద్యుద్దీకరణ పనుల వల్ల ఈ నెల 10 నుంచి 19 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-రాయచూర్, కర్నూలు సిటీ, గద్వాల్, గుంతకల్, బోధన్ మార్గాల్లో నడిచే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్ జడ్చర్ల వరకు మాత్రమే నడుస్తుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని కోరారు.