అలంపూర్ మున్సిపాలిటీ సుందరీకరణ పనులు
GDWL: అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో సుందరీకరణ పనులు ఒక్కొక్కటిగా కొనసాగుతున్నాయి. గాంధీ చౌక్ నుంచి టూరిజం దగ్గర బ్రిడ్జి వరకు రోడ్లు దాదాపు పూర్తయ్యాయి. డివైడర్లు, విద్యుత్ దీపాలు, కలరింగ్ పనులు పూర్తయ్యాయి. డివైడర్ మద్యలో మట్టిని నింపారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా అందమైన చెట్లు నాటాల్సిన పని మిగిలి ఉంది.