షార్ట్ సర్క్యూట్‌తో పశువుల చావడి దగ్దం

బాపట్ల: రేపల్లె మండలం పేటేరు గ్రామానికి చెందిన సాంబశివరావుకు చెందిన పశువుల చావిడి షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం అగ్నికి ఆహుతైంది. 7 నెలలు చూడి గేదే కాలి చనిపోగా, ఒక పాడి గేదే, 2 సంవత్సరాల పడ్డ దూడకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. మండల పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని పశువులకు వైద్యం అందించారు.