నాచగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షణ
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని శనివారం ఉదయం గిరి ప్రదక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో రంగాచారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.