కుక్కల దాడిలో జింక పిల్ల మృతి

MNCL: బెల్లంపల్లిలో కుక్కల దాడిలో ఓ జింక పిల్ల మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీ లోనీ స్మశాన వాటిక సమీపంలో 2 సంవత్సరాల జింక పిల్ల మృతి చెందింది. కుక్కల దాడిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఐటీడీఏ తోట నుంచి తరచుగా జింకలు వస్తు ఉంటాయి. అటవీ అధికారులకు సమాచారం అందించారు.