VIDEO: ఉగాది స్పెషల్.. జడలొప్పులాట..!
NZB: జిల్లా చందూర్ మండల కేంద్రంలో ప్రతి ఏటా ఉగాది పండుగ నాడు జడలొప్పులాట వేయడం ఆనవాయితీగా వస్తుంది. గురువారం ఉగాది పండుగ సందర్భంగా జడకొప్పులాటకు సర్వం సిద్ధం చేశారు. కళాకారులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ జడకొప్పులు అల్లడం ఆసక్తిగా ఉంటుంది. చందూర్ గ్రామంతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ జడకొప్పులాటను తిలకించేందుకు వస్తుంటారు.