VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: రాయచోటి–వేంపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జిలాన్ భాష అనే లారీ డ్రైవర్‌కు కాలు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.