పెట్రోల్ కొరత.. వాహనదారులకు చుక్కలు!

పెట్రోల్ కొరత.. వాహనదారులకు చుక్కలు!

KRNL: ఆదోని మండలం పెద్దతుంబలంలో పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 4 రోజులు కావొస్తున్నా పెట్రోల్ బంక్‌లలో సరఫరా నిలిచిపోవడంతో వాహనదారులు బాధలు వర్ణనాతీతం. ఇదే అదునుగా భావించిన కొందరు ఎలాంటి కొలతలు లేకుండా ఇష్టమొచ్చిన విధంగా పెట్రోల్ అధిక ధరలకు అమ్ముతున్నారు. బాటిళ్లను నింపి, వాహనదారులను మోసం చేస్తున్నారు.