లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఛార్జింగ్ పాయింట్
RR: లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేశారు. GHMC, రెడ్కో ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఎలక్ట్రిక్ వాహన వినియోగం మరింత ప్రోత్సాహం పొందనుంది. స్థానికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.