కలెక్టరేట్‌లో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

KNR: మహాత్మా శ్రీ బసవేశ్వర 892వ జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. శ్రీ బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీ.ఆర్.ఓ వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రజలను మూఢనమ్మకాల నుంచి కాపాడారని అన్నారు.