'యూరియా పంపిణీ పారదర్శకంగా రైతులకు అందించాలి'
MHBD: రైతులకు యూరియా పారదర్శకంగా అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధ్వైత్ కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మరిపెడ మండలంలోనీ PACS యూరియా పంపిణీ కేంద్రంలో సరఫరా చేస్తున్న ప్రక్రియను పరిశీలించి ప్రతి రైతుకు యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.