ఆ బాధ్యత పోలీసులదే: రేవంత్

TG: సరిహద్దుల్లో సైనికుల్లాగా రాష్ట్రంలో పోలీసులు శాంతిభద్రతలు పరిక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా ఇస్తున్నాం. ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అదనపు ఎస్పీ, ఎస్పీ కుటుంబాలకు రూ.కోటిన్నర అందిస్తున్నాం. నేరం జరగకుండా నియంత్రించే బాధ్యత పోలీసులపై ఉంది' అని పేర్కొన్నారు.