వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

NDL: జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నెంబరును 08514-293903 ఏర్పాటు చేశామని తెలిపారు.