కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే

RR: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఒక నిరంతర ప్రక్రియగా సీఎం సహాయ నిధిని కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.