రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

SDPT: లారీ, బైక్ ఢీకొని మహిళా మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన కొమురవెల్లి మండలలోని లెనిన్ నగర్ గ్రామసమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. భార్య ఎర్రోళ్ల సునీత (42) మృతి చెందగా, భర్త రమేష్, కూతురు కీర్తనకు తీవ్ర గాయాలయ్యాయి. క్షేతగాత్రులను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.