విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: డీఈవో

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి: డీఈవో

కామారెడ్డి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆవరణలో జిల్లా క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 14,17 క్రీడా పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని తెలిపారు.