రేపు గరుగుబిల్లిలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
PPM: : గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యా ణ మహోత్సవాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రాచూరి గోపాలకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కళ్యాణానికి భక్తులంతా హాజరు కావాలని, కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు ఈ ఫోన్ నంబర్ 94453 67194ను సంప్రదించాలని వారు కోరారు.