ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

NLG: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు శనివారం పట్టుకున్నారు. గ్రామీణ ఎస్సై లక్ష్మయ్య కథనం ప్రకారం.. కాల్వపల్లిలో ఇసుక తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా కాల్వపల్లి తండా నుంచి మిర్యాలగూడ వైపు అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుబడింది. ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశారు.