VIDEO: బైక్ అదుపుతప్పి కాలువలో పడి యువకుడు మృతి
GNTR: పెదనందిపాడులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇనగల్లు గ్రామానికి చెందిన తమ్ములూరి కిషోర్ బాబు(28) ఓ ఆయిల్ కాటన్ మిల్లులో పనిచేసి, ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మరణించాడు.