రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్టాండ్ ముందు చిరు వ్యాపారస్తులు మట్టి పోసి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి మట్టి తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై మట్టి పేరుకుపోవడం వల్ల వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండటంతో వెంటనే చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.