ఎస్ఐఆర్‌ను పకడ్బందీగా చేపట్టాలి: ఆర్డీవో
SRPT: ఎస్ఐఆర్‌ను పకడ్బందీగా చేపట్టాలని ఆర్డీవో వేణు మాధవరావు సూచించారు. బుధవారం ఆత్మకూరు (ఎస్) లోని రైతువేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా బూతు లెవల్ అధికారులు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో కచ్చితత్వం, పారదర్శకత, సమగ్రత పాటించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపడుతోందన్నారు.