విశాఖ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐపీఎల్ చేదువార్త..!
VSP: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ నేడు ఘనంగా ప్రారంభం కానుంది. అయితే, ఈ సారి విశాఖ క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ తీవ్ర నిరాశను మిగిల్చింది. ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ సీజన్‌లో BCCI విడుదల చేసిన రెండు షెడ్యూల్లలో విశాఖ స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడమే ఇందుకు కారణం. గతంలో అభిమానుల కేరింతలతో నిండిన గ్యాలరీలు ఇప్పుడు బోసిపోయి కనపడనున్నాయి.