NCC విద్యార్థిని అభినందించిన ఎస్పీ
KMR: భిక్కనూర్ మండలం మాందాపూర్ కౌంటింగ్ సెంటర్‌లో విధుల్లో ఉన్న NCC విద్యార్థితో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆప్యాయంగా మాట్లాడారు. ఇది తన మొదటి డ్యూటీ అని విద్యార్థి చెప్పగా, అతని అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. అతనిలో ఉన్న నిబద్ధత ఉత్సాహం పట్ల SP అభినందించారు. మంచి స్ఫూర్తితో పని చేస్తున్నందుకు ధైర్యం, ఉత్సాహం నింపుతూ విద్యార్థిని మెచ్చుకున్నారు.